విశాఖ పశ్చిమ నియోకవర్గం 60వ వార్డు కార్పొరేటర్ పీ. వీ సురేష్ పై అక్రమంగా రౌడీ షీట్ ఓపెన్ చేసిన కారణంగా మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేయనున్నామని నియోజకవర్గం వైసీపీ సమన్వమకర్త మళ్ల విజయప్రసాద్ సోమవారం తెలిపారు. కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, వార్డు ఇంచార్జ్ లు, స్టేట్ కమిటీ నాయకులు, సిటీ కమిటీ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు తరలిరావాలని ఆయన పిలుపునచ్చారు.