ప్రణాళికాయుతంగా గాజువాక జోన్ అభివృద్ధి
జీవీఎంసీ గాజువాక జోన్ పరిధిలో అభివృద్ధి పనులను ప్రణాళిక యుతంగాప్రణాళికాబద్ధంగా చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలను అందించే దిశగా అధికారులు, వార్డు కార్యదర్శులు విధులు నిర్వహించాలని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన గాజువాక జోనల్ స్థాయి సమీక్షా సమావేశాన్ని ఉన్నతాధికారులు, గాజువాక జోన్ సంబంధిత అధికారులతో కలిసి షీలానగర్ వద్ద సిగ్నేచర్ హోటల్ నందు నిర్వహించారు.