ప్రభుత్వ నర్సుల సేవల కారణంగానే కేజీహెచ్‌కు గౌరవం పెరుగుతోందని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ అన్నారు. జిల్లా ప్రభుత్వ నర్సుల సంఘం ఎన్నికల తర్వాత మొదటి సర్వ సభ్య సమావేశం శుక్రవారం ఆంధ్రా వైద్య కళాశాల సమావేశపు మందిరంలో జిల్లా అధ్యక్షురాలు గంగా భవానీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ నర్సుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు.