విశాఖ పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణలో భాగంగా పిలిచిన టెండర్లను రద్దు చేయాలని సిఐటియు కార్యదర్శి బి. జగన్ డిమాండ్ చేశారు. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణకు నిరసనగా కార్మిక సంఘాలు పోర్టు హాస్పటల్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించాయి. ధర్నాలో పాల్గొన్న జగన్ మాట్లాడుతూ సొంత నిధులతో హాస్పిటల్ ను అభివృద్ధి చేయాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ హాస్పిటల్ 40, 000 మందికి సేవలు అందిస్తుందన్నారు.