విశాఖ కలెక్టరేట్ ప్రాంగణంలో రెవెన్యూ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బంది ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఒత్తిడిని తగ్గించుకుని విధులు నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి బిహెచ్ భవాని ప్రసాద్ పాల్గొన్నారు.