నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఎఫ్ఓ శ్యామ్యూల్ బుధవారం స్పీకర్ అయ్యన్నపాత్రుడుని నర్సీపట్నం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ 1999-2000లో తాను అటవీ శాఖ మంత్రిగాఉన్న సమయంలో నర్సీపట్నం బీట్‌లోని అరిలోవా రిజర్వ్ ఫారెస్ట్‌లో ఏర్పాటు చేసిన ఔషధ మొక్కల తోటను అభివృద్ధి చేయాల్సిందిగా సూచనలు చేశారు. అలాగే, స్థానికంగా డిమాండ్ ఉన్న సరుగుడు మొక్కల నర్సరీ ఏర్పాటు చేయాలన్నారు.