గొలుగొండ మండలం పుత్తడి గైరంపేట పంచాయతీలో జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాలు జరిగినట్లు అనకాపల్లి కలెక్టర్ కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలువురు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీడీవో మేరీ రోజ్, ఉపాధి హామీ పథకం ఏపీవో సూర్య మణి, ఈసీ రాధిక సమక్షంలో గురువారం ఉపాధి కూలీలను విచారించారు. విచారణలో ఉపాధి కూలీలు వెల్లడించిన వివరాలను జిల్లా అధికారులకు నివేదిక అందించినట్లు ఎంపీడీవో తెలిపారు.