రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు ఈ ఏడాది రూ. 29,000 కోట్లు కేటాయించడం జరిగిందని విశాఖ ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. శుక్రవారం ఎన్ఏడి జంక్షన్ వద్ద నూతన విద్య వ్యవస్థపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య అనేది కేవలం విజయం కోసం కాదని అన్నారు. సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనం అన్నారు. అయితే అది డిజిటల్ వైషమ్యాన్ని పెంచకుండా అందరికి అందుబాటులో ఉండేలా చూడాలన్నారు..