హన్మకొండ సభలో మంగళవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాపై ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపిస్తున్నారని, దీంతో కొత్త వరంగల్ ను చూడబోతున్నామని అన్నారు. వరంగల్ అభివృద్ధి కోసం హైదరాబాదులో ఆరుసార్లు జిల్లా ఇన్చార్జ్ మంత్రితో పాటు, సీఎంతో పలుమార్లు కలిసి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరినట్లు చెప్పారు.