జనగామలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, మెడికల్ కళాశాలలో 13 కేటగిరీ పరిధిలో ఖాళీగా ఉన్న 50 పోస్టుల భర్తీకి మెరిట్ జాబితా విడుదల చేసినట్లు గురువారం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గోపాలరావు తెలిపారు. మెరిట్ జాబితాలో అభ్యంతరాలు ఉంటే 24- 28వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు తగిన రుజువులు జతచేసి రాత పూర్వకంగా తమకు అందించాలన్నారు. అలాగే డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహిస్తామన్నారు.