బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన ఓ భవనంలో దొంగలు పడటం కలకలం రేపుతోంది. ప్రిన్స్ ఛార్లెస్ దంపతులు అప్పుడప్పుడు సేద తీరే విండ్సర్ క్యాజిల్‌లో ఆదివారం రాత్రి భారీ భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. నిత్యం అత్యంత భద్రత ఉండే ఈ భవనంలో ఫెన్సింగ్ దూకి ఎస్టేట్‌లోకి ప్రవేశించిన దొంగలు ఓ ట్రక్కు, బైక్‌ను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.