తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను నిర్మాణాలకు ఉచితంగా ఇవ్వాలని సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కరిమెల శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మల్లయ్య ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక అందడం లేదని ప్రభుత్వం తీసుకొచ్చిన విధివిధానాలు అమలు కావడం లేదని అన్నారు. అనంతరం వినతి పత్రం అందజేశారు.