సంగారెడ్డి జిల్లాలో పశుగణన పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో పశుగణన పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పరిశోధన జరుగుతుందని చెప్పారు. ఫిబ్రవరి 28వ తేదీలోపు పూర్తి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పరిషత్ సంవర్ధక శాఖ అధికారి వసంత కుమారి పాల్గొన్నారు.