జిన్నారం మండల కేంద్రంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి గురువారం పర్యటించారు. సూపర్వైజర్లు రూట్ అధికారులు సర్వే పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సర్వే సిబ్బందికి వచ్చే అనుమానాలను వెంటవెంటనే సూపర్వైజర్లు అధికారులు నివృత్తి చేసి కచ్చితత్వంతో కూడిన సర్వే జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ భిక్షపతి, ఏంపీడీఓ అరుణారెడ్డి, తదితరులు ఉన్నారు.