మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత ప్రస్తుతం సిటాడెల్-హనీబన్నీ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆమె యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకులు ముగ్ధులవుతున్నారు. ఇందులో ఆమెతో కలిసి నటించిన వరుణ్ ధావన్ ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాన్ని వెల్లడించారు. 2 గంటల పాటు నాన్‌స్టాప్ షూటింగ్ జరుగుతుండగా సమంత స్పృహ తప్పి పడిపోయిందని, కాసేపటికే తిరిగి లేచి ఆమె షూటింగ్లో పాల్గొందని వరుణ్ పేర్కొన్నాడు.