ఏఆర్ రెహమాన్ చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి.. ఆయన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించవద్దు అని సైరా బాను పేర్కొన్నారు. "గత కొన్ని నెలలుగా నా ఆరోగ్యం బాలేదు. ఆ కారణంతోనే ఆయనకు దూరంగా ఉండాలనుకున్నాను. దయచేసి ఆయన గురించి ఎలాంటి చెడు ప్రచారం చేయవద్దు. ఆయన ప్రపంచంలో ఉన్న గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు. నేను చికిత్స కోసం ముంబై వచ్చా. ఆయన అంటే నాకెంతో ఇష్టం. ఆయనకు కూడా నేనంటే ఇష్టం." అని ఆమె తెలిపారు.