జన్నారం: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే వరి కొనుగోలు కేద్రాలలో అమ్ముకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం జన్నారం మండలం రాంపూర్ తిమ్మాపూర్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. దళారులను నమ్మి మోసపోకుండా మద్దతు ధర కల్పిస్తున్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி