లగచర్ల నిందితుల్ని కలిసిన NHRC బృందం

వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో అరెస్టై సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న నిందితులను 8 మంది సభ్యులతో కూడిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) బృందం ఆదివారం కలిసింది. ఈ కేసులో ఏ2 నిందితుడు సురేష్ సహా 19 మంది నిందితులు సంగారెడ్డి జైల్లో ఉన్నారు. నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న NHRC బృందం.. ఇవాళ ఉదయం సంగారెడ్డి జైలుకు వెళ్లింది. లగచర్ల ఘటనలో ఏం జరిగిందో వారిని అడిగి తెలుసుకుంది.

தொடர்புடைய செய்தி