భారీ వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. పూర్తిస్థాయి నీటిమట్టం కంటే అధికంగా వరద పెరగడంతో మ. 3: 30 గంటలకు ప్రాజెక్టు 11వ నంబర్ క్రస్ట్ గేట్ 1. 5 మీటర్లుక ఎత్తి దిగువకు నీటిని వదిలినట్లు ప్రాజెక్టు ఏఈ మైపాల్ రెడ్డి తెలిపారు. ఒక గేటు ద్వారా 8142 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతున్నట్లు చెప్పారు. మంజీరా నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.