ప్రతి వారం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను తక్షణమే పరిశీలించి పరిష్కారం చేసే దిశగా కృషి చేయాలని మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు అన్నారు. లక్షేట్టిపేట తహసీల్ కార్యాలయాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు ధరణి పెండింగ్ పనులు, పట్టబద్రుల ఓటర్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. రికార్డులను పరిశీలించిన ఆయన తహశీల్దార్ దిలీప్ కుమార్ కు పలు సూచనలు అందించారు.