మున్షిప్ మెజిస్ట్రేట్ కోర్టు శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు అన్నారు. లక్షేటిపేట మండల కేంద్రంలోని కోర్టు భవనాన్ని శనివారం పరిశీలించారు. వేడుకల నిర్వాహణకు కోర్టు ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లు, మరమ్మతులను పరిశీలించారు. వేడుకల ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలని తెలిపారు.