మంచిర్యాల: పరిశుభ్రత పాటించేలా చూడాలి

పిల్లలకు అవగాహన కల్పించి పరిశుభ్రత పాటించేలా చూడాలని మంచిర్యాల జిల్లా వైద్య శాఖ అధికారి హరీష్ రాజ్ సూచించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో మంగళవారం ఎంఈఓ లు, ఉపాధ్యాయులు, మండల వైద్యాధికారులు, ఇతర వైద్య సిబ్బందికి ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా పాఠశాల ఆరోగ్య విద్యపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పిల్లలకు అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్యకరమైన మార్పులు సాధించవచ్చని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி