రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పత్తికి మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పేర్కొన్నారు. చెన్నూరు సమీపంలోని కాటన్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రారంభించారు.