బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియాలో రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ఇంటిగ్రేటెడ్ కూరగాయల విక్రయ మార్కెట్ భవనాన్ని నిర్మించింది. ఈ భవన సముదాయంలో నిత్యం పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. నిత్యం వందల మంది కూరగాయలు తీసుకోవడానికి వచ్చేవారికి పారిశుధ్య లోపంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు శనివారం డిమాండ్ చేస్తున్నారు.