ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు సుద్దరేవు గ్రామ రైతులు ఆదివారం వినతి పత్రం అందించారు. 2005 కంటే ముందే సాగులో ఉన్న భూమిని గుర్తించి ప్రభుత్వం వారు ఆర్ఎస్ఆర్ పట్టాలు ఇచ్చారని రైతులు ఎమ్మెల్యేకు తెలిపారు. అలాంటి భూములపై ఇప్పుడు ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు, రైతులు వెళ్లి ఆ భూమిని సాగు చేయనీయకుండా అడ్డుపడుతున్నారని ఎమ్మెల్యేకు వివరించారు.