ఇల్లెందులో అనుమతులు లేకుండా బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేస్తే పేలుడు పదార్థాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆదివారం ఇల్లందు సీఐ సత్యనారాయణ హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, పట్టణ పరిసర ప్రాంత పరిధిలోని ఆయా గ్రామాలలో సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసిన, విక్రయాలు జరిపిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ తెలిపారు.