భద్రాచలం: రామాలయంలో ఇద్దరు ఉద్యోగులకు మెమోలు జారీ

భద్రాచలం రామాలయంలోని ఇద్దరు ఉద్యోగులకు ఈఓ రమాదేవి శుక్రవారం మెమోలు జారీ చేసినట్లు సమాచారం. ఆలయానికి అనుబంధంగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం, లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయాలను గురువారం ఉదయం కొన్ని గంటల పాటు మూసి ఉంచారు. ఇది వివాదమైంది. సూపరింటెండెంట్కు, ఇనస్పెక్టర్లకు మెమోలు జారీచేసి వివరణ కోరినట్లు తెలుస్తోంది. వీరిచ్చే వివరణను దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకునే వీలుందని సమాచారం.

தொடர்புடைய செய்தி