కాగజ్నగర్ పట్టణం సర్సిల్క్ లోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం కౌటాల మండలం ముత్తంపేట్ గ్రామానికి చెందిన నలుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లబ్ధిదారులకు పరిహారం అందేలా చేస్తామని, తమ కార్యాలయంలో ఆసుపత్రికి సంబంధించిన పత్రాలు సమర్పించాలని అన్నారు.