ఎమ్మెల్సీకి సమస్యలు వివరించిన సమతా సొసైటి సభ్యులు

కాగజ్‌నగర్‌ సమతా ఎంప్లాయ్ సొసైటీ సభ్యులు ఆదివారం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండేవిటల్ ను వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువతో సన్మానించి పలు సమస్యలను దృష్టికి తీసుకురాగా వారు సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానీకి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమతా సొసైటీ ఎంప్లాయ్ యూనియన్ అధ్యక్షులు దుర్గం జనార్దన్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி