ఎల్లారెడ్డి పట్టణంలోని 2వ వార్డు గాంధీ నగర్ లో ఓ నక్క తిరుగుతుంది. గురువారం ఉదయం పని మీద వెళుతున్న ఓ వ్యక్తికి కనిపించగా, నక్క గురించి ఆరా తీశాడు. నక్క గత నాలుగు నెలలుగా ఎక్కడి నుండో వచ్చి ఇక్కడే తమ మధ్యనే రోజు సంచరిస్తుందని, దాని బాగోగులు జంగంరాజు అనే వ్యక్తి చూసుకుంటారని సమాచారం. దానికి కావాల్సిన తిండి సమకూర్చడంతో ఆ నక్క ఆ పరిసరాల్లోనే సంచరిస్తుందని తెలిసింది.