క్రషర్ మిషన్ ను వెంటనే తొలగించాలని వినతి

ఎల్లయ్య సన్స్ క్రషర్ మిషన్ సర్వే నంబర్ 138/1 బిచ్కుంద శివారులో గల క్రషర్ మిషన్ ను వెంటనే తొలగించాలని గోపనపల్లి గ్రామ యువకులు తహశీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్ కు వేర్వేరుగా వినతి పత్రం అందించారు. క్రషర్ మిషన్ గోపనపల్లి గ్రామానికి 500 మీటర్ల దూరంలో ఉండడం వలన ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని, బ్లాస్టింగ్ సౌండ్ కు హార్ట్ పేషెంట్స్ చనిపోవడం, డాంబర్ ప్లాంట్ నుంచి వచ్చే పొగ వలన క్యాన్సర్ వ్యాధులతోె ప్రజలు చనిపోతున్నారని తెలిపారు. వినతిపత్రం అందించిన వారిలో శెట్టిపల్లి విష్ణు, గంగాధర్, బలగం నాగరాజు, నాయిని సందీప్, నాయిని శ్రీకాంత్, కొట్టే సంతోష్, తదితరులు ఉన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி