పేట్ల బురుజు ఆసుపత్రిలో ఐవిఎఫ్ సెంటర్

పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం అన్నారు. మంగళవారం గాంధీ ఆసుపత్రి ఎంసిహెచ్ బిల్డింగ్లోని ఐవిఎఫ్ సెంటర్ను ఆయన పరిశీలించారు. 15 రోజుల్లో పేట్ల బురుజు ఆసుపత్రిలో నూతనంగా ఐవిఎఫ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ ప్రాంతాల్లో కూడా ఐవిఎఫ్ సెంటర్లను పెడతామన్నారు.

தொடர்புடைய செய்தி