వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరాలయంలో రేపు కార్తీక మాసం, మూడో సోమవారం పురస్కరించుకొని హరిహరులకు లక్ష పుష్పార్చన, జల దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు రాత్రి 8:00 గంటలకు కటకం కృష్ణస్వామి కుటుంబ సభ్యులు భక్తులకు ఉపాహారం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమంను విజయవంతం చేయాలని కోరారు.