వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రేమ్ టైలర్ షాపులో మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకొని బుధవారం రక్తదాన శిబిరాన్ని వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ఉప అధ్యక్షుడు ఎండి ఇర్షాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సమయంలో రక్తం నిల్వలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతుంటారు అని అన్నారు. వారి కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.