కార్మికులను పర్మినెంట్ చేయాలి

వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో, ఆసుపత్రుల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నారాయణపేట మున్సిపల్ పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని, ప్రతి నెల 5 లోపు జీతాలు చెల్లించాలని అన్నారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, మహిళలకు మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி