కల్వకుర్తి మండలం తర్నికల్ లో నిరుపేదల భూములను కొంత మంది కబ్జా చేశారని మాజీ బీసీ జాతీయ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. బుధవారం తర్నికల్ గ్రామంలో పర్యటించారు. గ్రామ రైతులు తెలిపిన నిరసనకు ఆయన తన మద్దతుని తెలిపారు. తర్నికల్ గ్రామానికి చెందిన 125 మంది రైతులు గ్రామ శివారులో ఉన్న 275 ఎకరాలను కొన్ని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారని అన్నారు.