కల్వకుర్తి మండల కేంద్రానికి 9 కి. మీ దూరంలో ఉన్న ఎల్లికల్ గ్రామంలోని శివాలయంలో 400 ఏళ్ల నాటి అరుదైన అతి చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉందని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా సీఇఓ డా. ఈమని శివ నాగిరెడ్డి తెలిపారు. బుధవారం గ్రామ శివారులోని శిథిల శివాలయాన్ని విజిట్ చేసారు. విజయనగర కాలానీకి చెందిన 400 ఏళ్ల నాటి చారిత్రక ప్రాధాన్యత గల ఈ అరుదైన చిన్న శిల్పాలను కాపాడుకొని, భావితరాలకు అందించాలన్నారు.