మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను గురువారం మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో కలిసి పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతతో ఉన్న విద్యార్థులకు పురుగులతో కూడిన టిఫిన్ పెట్టారని విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోయారు.