సాధారణంగా మన దేశంలో పండగలు ఏదో ఒక మతానికి చెందినవి ఉంటాయి. కానీ, దీపావళి మాత్రం ఒక మతానికే పరిమితం కాదు.. అన్ని మతాల వారు జరుపుకునే అరుదైన పండగ. అమావాస్య రోజున జరుపుకునే వెలుగుల వేడుకను దీపావళి అంటారు. ఇవాళ ఊరూరా.. ఇంటింటా ముంగిళ్లలో అసంఖ్యాకంగా దీపాలు వెలుగుతాయి. దీంతో అమావాస్య రాత్రి పున్నమిని మించిన వెలుగులు కనిపిస్తాయి.