భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. హర్యానా అంబాలాలో భారీ వరద ముంచెత్తింది. ఈ క్రమంలో ఛమన్ వాటిక కన్యా గురుకుల్ స్కూల్ లో 730 మంది విద్యార్థినులు చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న ఆర్మీ అధికారులు రంగంలోకి దిగారు. స్థానికులు, పోలీసుల సాయంతో వారిని రక్షించారు. కాగా, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.