నేటి నుంచి యధావిధిగా పంటు సేవలు

నరసాపురం- సఖినేటిపల్లి గ్రామాల మధ్య పంటు సేవలు సోమవారం నుంచి పునరుద్ధరించనున్నారు. గోదావరికి వరద ఎక్కువగా ఉండటంతో అధికారులు గత నాలుగు రోజులుగా పంటు సేవలు నిలిపివేశారు. ఉద్ధృతి తగ్గడంతో పంటు సేవల పునరుద్ధరణకు అనుమతి ఇచ్చామని ఇన్‌ఛార్జి ఎంపీడీవో వీకే వీరభద్రరావు తెలిపారు. దీంతో నిర్వాహకులు పంటు సేవలు పునరుద్ధరించారు.

தொடர்புடைய செய்தி