ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నరసాపురంలో వశిష్ట గోదావరికి వరద పెరగింది. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా నరసాపురం-సఖినేటిపల్లి మధ్య గోదావరిపై పంటి ప్రయాణాన్ని నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల మధ్య రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే భారీ వర్షాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.