అగ్ని ప్రమాద బాధితులకు తక్షణ సహాయం

టెక్కలి మండల పరిధిలోని ఆంజనేయపురంనకు చెందిన ముడిదాన జంగమయ్య గృహంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాద వశాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాధిత కుటుంబానికి చెందిన దుస్తులు, గృహోకరణాలు, ఇతరత్రా వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి.ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆదేశాలు మేరకు శనివారం టెక్కలి పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి ధనుంజయ తో పాటు వైసిపి నాయకులు తులసీరావు, మధీన్, కర్ణిక జీవన్ మరియు ఆ గ్రామ పెద్దలు ఆదినారాయణ తో కలిసి బాధిత కుటుంబాన్ని కలిసి తక్షణ సహాయం అందించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி