బెల్ట్ షాపులో తనిఖీలు.. 14 మద్యం బాటిళ్లు స్వాధీనం

వంగర మండలం శివ్వాం గ్రామంలో ఆదివారం ఓ వ్యక్తి అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తున్నారన సమాచారంతో బెల్ట్ షాపులపై పోలీసులు దాడులు చేశారు. బెల్ట్ షాపుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 14 బాటిళ్లను ఎస్సై షేక్ శంకర్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అక్రమ మద్యం అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కానిస్టేబుల్ చిరంజీవి శంకరరావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி