శింగనమల మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ హాజరయ్యారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి, రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. కూటమి ప్రభుత్వంలో నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.