పెనుకొండ: పన్నుల బకాయిల వసూళ్లలో రాజీపడొద్దు

పన్నుల బకాయిల వసూళ్లలో రాజీపడొద్దని మంత్రి సవిత పేర్కొన్నారు. మంగళవారం పెనుకొండ పట్టణంలోని నగర పంచాయతీ సమావేశం భవనంలో అత్యవసర కౌన్సిల్ సమావేశం ఛైర్పర్సన్ ఫరూక్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి పార్టీలకతీతంగా కృషి చేద్దామని, పెనుకొండలో మౌలిక వసతుల కల్పన అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కమిషనర్, కౌన్సిలర్ లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி