శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయంలో దసరా నవరాత్రులు దిగ్విజయంగా పూర్తైన శుభ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ రమానందన్ సోమవారం కృతజ్ఞతలు తెలియజేశారు. అయన మాట్లాడుతూ 2024 దసరా శరనవరాత్రుల మహోత్సవాలు ఇంత ఘనంగా నిర్వహించడానికి సహకరించిన భక్తులు, అధికారులు, పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బంది, గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా సహకరించాలని కోరారు.