గుత్తి మండలం తొండపాడు గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని గురువారం ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. సచివాలయానికి వచ్చే ప్రజలతో మర్యాదగా మెలగాలని సిబ్బందికి సూచించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం సేవలు అందించాలని తెలిపారు. విధులకు గై హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.