ఈ స్టాంపులు అందుబాటులో ఉంచాలని, స్టాంప్ వెండర్లు స్టాంపులకు అదనంగా చార్జీలు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం గుంతకల్లు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదురుగా సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ స్టాంపులపై అదనంగా చార్జీలు వసూలు చేస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.