ధర్మవరం పట్టణం శివానగర్ లోని బీఎస్సార్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో.. మంగళవారం జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ ఇన్ఛార్జ్ హరీశ్ మాట్లాడుతూ.. నులి పురుగు నివారణ మందుతో కడుపులో నులిపురుగులు చనిపోయి ఆరోగ్యవంతమైన, రక్తహీనత నివారణకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డోలా రాజారెడ్డి, జింక చంద్రశేఖర్, సాకే ఓబులేసు, గుండా పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.